కశ్మీర్‌లో ఉగ్రదాడిపై నిరసన
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:31 AM
కశ్మీరులో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గురువారం వీహెచ్‌పీ, బీజేపీ, హిందూ పరిరక్షణ వేదిక, హిందూ సంఘాలు తదితర సంస్ధల ఆధ్వర ్యంలో భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
నంద్యాల కల్చరల్/రూరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): కశ్మీరులో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గురువారం వీహెచ్‌పీ, బీజేపీ, హిందూ పరిరక్షణ వేదిక, హిందూ సంఘాలు తదితర సంస్ధల ఆధ్వర్యంలో భారీ నిరసన, శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నందిపైప్స్ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమకు అవకాశం ఇస్తే సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని నంద్యాల జిల్లా మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తెలిపారు. చనిపోయిన వారికి గురువారం మాజీసైనికుల కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. తీవ్రవాదులను శిక్షించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని జనసేన నాయకులు గురుబాబు, రాము పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు.
ఆత్మకూరు: కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం అమానుషమైన చర్య అని బీజేపీ నాయకులు గరుడాద్రి సుదర్శన్, ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహ వాసుదేవరెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీధర్‌గుప్తా, ఆవులరెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు గరుడాద్రి సత్యనారాయణశర్మ, ఆర్యవైశ్య సంఘం నాయకులు నరహరి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, మానవహారం చేశారు. మరణించిన వారికి కొవ్వొలతో నివాళి అర్పించారు. జనసేన పార్టీ నాయకులు అరుణ్, హరీష్ తదితరులు గౌడ్‌సెంటర్ నందు అమరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు.
సున్నిపెంట: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ గురువారం రాత్రి సున్నిపెంటలో ప్రజలు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శ్రీశైలం మండల అధ్యక్షుడు చదువు శ్రీను, నాయకులు వెంటేశ్వర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెలుగోడు: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదులను తుద ముట్టించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన హింసాకాండను నిరసిస్తూ వెలుగోడులో కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు అన్నారపు శేషిరెడ్డి, మోమిన్ రసూల్, ఖలీల్, జాకీర్ హుశేన్, వెంకటరమణ, వీరభద్రుడు, జనసేన నాయకులు శాలుబాషా, శ్రీరాములు, బీజేపీ నాయకులు ప్రతాప్ ఆచారి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
నందికొట్కూరు: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు నందికొట్కూరు నియోజకవర్గ జనసేన నాయకుడు రామిరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలో జనసేన కన్నీటి నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు. వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ల మంజునాథ్, జనసేన నాయకులు పవన్ కుమార్, సంధ్యా విక్రమ్ కుమార్, కటిక మహమ్మద్ షబ్బీర్ బోయ గోవిందు పాల్గొన్నారు.
పాములపాడు: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడిచేసి పర్యాటకులను చంపడం హేయమైన చర్య అని బీసీ సంఘం జిల్లా కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఆర్ గోపాల్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు అంకన్న, జాతీయ బీసీల కార్యదర్శి బత్తుల సంజీవరాయుడు, మాల మహానాడు రాయలసీమ అఽధ్యక్షుడు అబ్రహాం అన్నారు. పాములపాడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
గడివేముల: జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మండలంలోని బిలకలగూడురు గ్రామంలో గురువారం జనసేన నాయకులు వెంకటేశ్వర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.