Share News

నూతన విద్యా సంస్కరణలపై రేపు నిరసన

ABN , Publish Date - May 03 , 2025 | 11:35 PM

నూతన విద్యాసంస్కరణలను వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు.

నూతన విద్యా సంస్కరణలపై రేపు నిరసన
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యాసంస్కరణలను వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, శివయ్య, జాకీర్‌హుశ్శేన్‌లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల లను నెలకొల్పితే, ప్రస్తుత ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటుచ ేస్తూ ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. నూతన సంస్కరణలతో పాఠశాల విద్యకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:35 PM