Share News

సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీయూ

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:58 AM

ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీయూ
మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి

కర్నూలు ఎడ్యుకేషన, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక సలాంఖాన ఎస్టీయూ భవనలో ముఖ్య కార్యకర్తల సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యో గులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడంతో శోచనీయమన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యో గులకు, పెన్షనర్లకు సంబందించిన 12వ పీఆర్సీ నియామకం చేయక పోవడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించకపోవడం, డీఏ మంజూరు చేయకపోవడం, సీఆర్‌ సీడీఏ బకాయిలు చెల్లించకపోవడం, పాత పెన్షన విధానాన్ని అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి పని చేయాలని, లేని పక్షంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన, గోవిందు, శేఖర్‌, గోవిందు నాయక్‌, సురేష్‌, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:58 AM