Share News

సమస్యలు తిష్ఠ

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:20 PM

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని కపర్థినగర్‌లో 10వేల మంది జనాభా నివసిస్తున్నారు. కాలనీలో చాలాకాలంగా సమస్యలు తిష్ఠ వేశాయి. తమ సమస్యలను పరిష్కారించాలని వార్డు సచివాలయ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోందని కాలనీవాసులు వాపోతున్నారు

సమస్యలు తిష్ఠ
కాలనీలో అధ్వానంగా ఉన్న రహదారి ఇన్‌సెట్‌లో ప్రమాదకరంగా గుంత

ఆదోని కపర్థి నగర్‌ దుస్థితి

డ్రైనేజీ లేదు, నిర్వహణా లేదు

పత్తాలేని మున్సిపల్‌ అధికారులు

ముళ్లకంపతో నిండిన పార్కులు

ఆదోని టౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని కపర్థినగర్‌లో 10వేల మంది జనాభా నివసిస్తున్నారు. కాలనీలో చాలాకాలంగా సమస్యలు తిష్ఠ వేశాయి. తమ సమస్యలను పరిష్కారించాలని వార్డు సచివాలయ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోందని కాలనీవాసులు వాపోతున్నారు. ఎస్కేడీ కాలనీకి సమీపంలోనే ఉండటంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. జనాభా పెరిగి సచివాలయం ఏర్పాటైనా సమస్యలు మాత్రం తీరలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్కులో కనిపించని ఆహ్లాదం

కాలనీలోని నాలుగు పార్కులుండగా వీటిలో ఆహ్లాదం ఏమాత్రం కనపించడం లేదు. దీంతో ఇవి నిరూపయోగంగా పడి ఉన్నాయి. శిల్ప సౌభాగ్య అపార్ట్‌మెంట్‌ పక్కనున్న ఒక ఖాళీ స్థలానికి మాత్రం ప్రహరీ నిర్వహించారు. కేవలం కొన్ని బెంచీలు ఏర్పాటు చేసి వదిలేశారు. ముళ్లకంప ఉండటంతో పార్కులో అడుగు పెట్టే అవకాశం లేదు. వాకింగ్‌ ట్రాక్‌, పిల్లలకు ఆటవస్తువులు లేవు.

డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నం

ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గం ధం వస్తోంది. రోడ్లు కూడా సరిగి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాడాంధకారం

విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో రాత్రిళ్లు బయటకు రావాలంటనే జంకుతున్నారు. ఎక్కడ ఏముందో తెలియడం లేదని వాపోతున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి, కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

పత్తాలేని సిబ్బంది

పట్టణంలో పారిశుధ్య పనులు చేయిం చాల్సిన మున్సిపల్‌ సిబ్బంది పత్తాలేరని కాలనీవసులు ఆరోపిస్తున్నారు. బయటకు రావాలంటే ముక్కు మూసుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందిచాలని కోరుతున్నారు.

గతంలో బాలికకు ప్రమాదం

కాలనీలోని విద్యుత్‌ స్తంభం నెం. 127/27 ఎదురుగా రోడ్డు మధ్యన గుంత ఏర్పడింది. గమనించని బాలిక రాత్రివేళ ప్రమాదానికి తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమైంది. అధికారులు స్పందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సమస్యలతో ఇబ్బంది..

కాలనీలో డ్రైనేజీ లేక దుర్గంధం వస్తోంది. దోమలు ప్రబలి అంటు రోగాలు వ్యాపిస్తున్నాయి. - హనుమంత రెడ్డి

సచివాలయ సిబ్బంది స్పందించాలి

కాలనీ సమస్యల పరిష్కారానికి సచివాలయ సిబ్బంది స్పందించాలి. కాల నీలో ఒక పార్కు కూడా అభివృద్ధి చేయకపోవడం సరికాదు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి. - శ్రీనివాస ఆచారి, టీడీపీ నాయకుడు

Updated Date - Jan 17 , 2025 | 11:20 PM