మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:26 AM
కల్లూరు అర్బన పరిధిలోని 16 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వను న్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

కల్లూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన పరిధిలోని 16 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వను న్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. గురువారం నగరం లోని 19వ వార్డు గౌతమి నగర్‌లో రూ.24 లక్షలతో సీసీ రోడ్ల నిర్మా ణానికి మేయర్ బీవై రామయ్యతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా గౌరుచరిత మాట్లాడుతూ కల్లూరు అర్బన లోని శివారు ప్రాంత సమస్య లపై దృష్టి సారించామన్నారు. కార్యక్ర మంలో కల్లూరు అర్బన వార్డుల ఇనచార్జి పెరుగు పురుషోత్తంరెడ్డి, 19వ వార్డు ఇనచార్జి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎస్‌ఈ రాజశేఖర్, ఎంఈ శేషసాయి, డీఈఈ నరేష్, ఏఈ భార్గవి పాల్గొన్నారు.