నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:41 AM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహరిం చారు.
మంత్రాలయం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహరిం చారు. సోమవారం పుష్య త్రయోదశి శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆఽధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాఘవరాయుడికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి స్వర్ణ కవచంతో చూడముచ్చట గా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళవా యిద్యాల మధ్య నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవలో నిర్వహించారు.