స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:02 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహారించారు.
మంత్రాలయం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహారించారు. మంగళవారం ఽమాఘమాసం ద్వాదశి శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునుంచే బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణభోద పూజ మందిరంలో మూలరాములకు, జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. స్వర్ణ రథం పై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు మఠం పీఠాధిపతి భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.