నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:57 AM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై ఊరే గారు.

మంత్రాలయం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై ఊరే గారు. శుక్రవారం మాఘవిధియ శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాఽఽధిపతి పూర్ణ బోధ పూజ మందిరంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ అంగరంగా వైభవంగా ఊరేగించారు. ఉత్సవమూర్తికి ఊంజలసేవ నిర్వహించి హార తులిచ్చారు. వివిధ రాషా్ట్రల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన భక్తులకు పీఠాధిపతి సుబుఽఽధేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు.