పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:36 AM
అర్హులైన పేదలకు ప్రభుత్వ గృహాల మంజూరు కోసం పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు ప్రభుత్వ గృహాల మంజూరు కోసం పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నాగటూరుకు బుధవారం ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి పేదల ఇళ్ల స్థలాల కోసం స్థల పరిశీలనకు వచ్చారు. వీఆర్వో స్వాములు లే అవుటును, గ్రామంలో గల స్థలాన్ని చూపించారు. ఎమ్మెల్యే జయసూర్య అక్కడికి చేరుకుని ఆర్డీవోతో చర్చించారు. ప్రభుత్వ గృహాలు మంజూరు కావాలంటే ముందుగా స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలను ఆమెకు వివరించారు. ఆమె సానుకూలంగా స్పదించి భూమిని పరిశీలించి వెళ్లారు. తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్వో జగదీ్‌ష్, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జూపాడుబంగ్లా: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. జూపాడుబంగ్లా గ్రామంలోని కాసానగర్‌లో బుధవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివమ్మ, గోవిందు దంపతుల పునీత్‌కు చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు అవరసమని, ఆదుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుయాదవ్, మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాదరెడ్డి, కేసీకాల్వ చైర్మన్ పరమేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు సురేంద్రనాథ్‌రెడ్డి, సుధాకర్, పెద్దన్న, రవికుమార్‌యాదవ్, రమణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, వేణుగోపాల్‌రెడ్డి, రవికాంత్, లక్ష్మన్నగౌడు, మన్సూర్‌బాషా, శాలుబాషా, మహిళా నాయకురాలు ప్రసన్నలక్ష్మీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.