Share News

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదు

ABN , Publish Date - May 01 , 2025 | 12:05 AM

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదని వెలుగోడు జేఏసీ నాయకులు అన్నారు.

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదు
వెలుగోడులో ర్యాలీ చేస్తున్న ముస్లింలు

వెలుగోడు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదని వెలుగోడు జేఏసీ నాయకులు అన్నారు. బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకముందు పహల్గాం జిల్లాలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. అనంతరం పాత బస్టాండు నుంచి ప్రధాన సెంటర్‌ వరకు జాతీయ జెండాలు, నల్ల జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను అణిచి వేయాలనే ఉద్దేశంతో దేశంలో నల్ల చట్టాలను తెస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం చేరుకొని తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌కు వినతిపత్రం అందించారు. జేఏసీ కన్వీనర్‌ మౌలానా జవాద్‌ అహమ్మద్‌, సీపీఎం నాయకులు, రాజశేఖర్‌, మాజీ సర్పంచ్‌ అబ్దుల్‌ కలాం, మౌలానా మహబూబ్‌ రెహమాన్‌, హిదాయత్‌ అలీ, మొమీద్‌ రసూల్‌, జాఖీర్‌ హుస్సేన్‌, షబ్బీర్‌, రఫీ, షబీర్‌, వలీ, సయ్యద్‌, మొహమ్మద్‌ఖాన్‌, సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:05 AM