వేతనాలు ఇవ్వండి సారూ..
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:00 AM
కరువు నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్తే వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. 8 వారాలుగా కూలి అంద లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ు.

మద్దికెర, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : కరువు నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్తే వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. మండలంలో 11 గ్రామాలు ఉండగా, 45వేల మంది నివసిస్తున్నారు. 10,500 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రతిరోజు 5వేల నుంచి 6వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు.
ఎనిమిది వారాలుగా కూలి అందడం లేదు..
తీరా పనులు చేశాక డబ్బులు అందడం లేదు. దీంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. 8 వారాలుగా కూలి అంద లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ు.
వలస పోవలి వస్తుందేమో..
పనికి పోయినా వేతనాలు అందకపోవడంతో తాము వలస పోవలసి వస్తుందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాస్తో కూస్తో చదువుకున్న వారు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ర్టాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందేలా చూడాలని కూలీలు కోరుతున్నారు.
కుటుంబ పోషణ భారం,,
సొంత ఊరిలోనే ఉపాఽధి పనులకు వెళ్తున్నాం. 8 వారాలుగా డబ్బులు రాలేదు. వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుంది. - హనుమన్న, మదనంతపురం
కూలీలు ఆందోళన చెందొద్దు
ఉపాధి కూలీలు ఆందోళ నలు చెందవద్దు, త్వరలోనే పెండింగ్ వేతనాలు అందు తాయి. వేతనాలు పెండింగ్ ఉన్న విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కూలీలు రోజూ పనికి వెళ్లాలి. - నర్సిరెడ్డి, ఏపీవో