Share News

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:09 AM

రాయలసీమ జిల్లాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
మాట్లాడుతున్న రామచంద్రయ్య

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. శనివా రం సీఆర్‌ భవనలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా గత వైసీపీ ప్రభు త్వం మోసం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. జిల్లాలోని వేదవతి, ఆర్‌డీఎస్‌, గుండ్రేవుల పెండింగ్‌ ప్రాజె క్టులకు నిధులు కేటాయించాలన్నారు. ఈ నెల 22,23 తేదీలలో కడప లో జరిగే రాయలసీమ జిల్లాల ప్రాజెక్టు సదస్సును జయప్రదం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కే.జగ న్నాథం, జిల్లా కార్యదర్శి పంపన్నగౌడు, కౌలురైతు సంఘం జిల్లా అధ్య క్షుడు సత్యనారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:09 AM