పెనాల్టీ కేసులను పరిష్కరించాలి: డీఆర్వో
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:57 PM
సమాచార హక్కు చట్టం-2005కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో రామునాయక్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం-2005కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో రామునాయక్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సమాచారహక్కు చట్టం-2005పై జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలో 4(1)బి రిజిస్టర్‌తోపాటు రిజిస్టర్ 1, 2తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సెక్షన్ 2సీ కింద ప్రజాప్రయోజనాలకు సంబంధించి ఏవైనా దరఖాస్తులు అడిగినపుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవికుమార్, సీ- సెక్షన్ సూపరింటెండెంట్ శుభకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.