Share News

ఎన్‌సీసీతో దేశభక్తి పెరుగుతుంది

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:37 PM

ఎన్‌సీసీలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని, సామాజిక అవగాహన కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా అన్నారు.

ఎన్‌సీసీతో దేశభక్తి పెరుగుతుంది
ఫైరింగ్‌ దృశ్యాన్ని తిలకిస్తున్న న్యాయాధికారి అమ్మన్నరాజా

నంద్యాల హాస్పిటల్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఎన్‌సీసీలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని, సామాజిక అవగాహన కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా అన్నారు. సోమవారం నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న 9వ ఆంధ్రా బాలికల బెటాలియన్‌ ఎన్‌సీసీ శిక్షణాశిబిరాన్ని ఆయన సందర్శించారు. ఎన్‌సీసీ అధికారులకు శిక్షణాశిబిరానికి అవకాశం కల్పించిన రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌ డా.జి.రామకృష్ణారెడ్డిని జడ్జి అభినందించారు. అనంతరం న్యాయాధికారి స్వయంగా ఫైరింగ్‌లో పాల్గొన్నారు.

ఎన్‌సీసీ కేడెట్ల ర్యాలీ: నంద్యాలలో ఎన్‌సీసీ కేడెట్లు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డా.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2047వికసిత భారత్‌ లక్ష్యంగా ప్రజలందరూ ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలన్నారు. డా.లలితాసరస్వతి, డిప్యూటీ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీప్రియ, కమాండెంట్‌ కల్నల్‌ జోబి ఫిలిఫ్‌, ఎన్‌సీసీ ఆఫీసర్లు శ్రీదేవి, గీతాంజలి, ధర్మేంద్రసింగ్‌, ధర్మేంద్రకుమార్‌, కమాల్‌సా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:38 PM