Share News

వైద్యం వికటించి రోగి మృతి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:29 AM

నగరంలోని ఓమినీ హాస్పిటల్‌లో వైద్యం వికటించి రోగి మృతి చెందారని బంధువులు ఆరోపించారు.

వైద్యం వికటించి రోగి మృతి
ఆందోళన చేస్తున్న బంధువులు, ఏఐవైఎఫ్‌ నాయకులు

హాస్పిటల్‌ ఎదుట బంధువుల ఆందోళన

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓమినీ హాస్పిటల్‌లో వైద్యం వికటించి రోగి మృతి చెందారని బంధువులు ఆరోపించారు. ఈసందర్భంగా రోగి బంధువులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళన చేశారు. దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన ఆదిలక్ష్మి(40) ఓపెన హార్ట్‌ సర్జరీ కోసం ఆరోగ్యశ్రీ కింద నగరంలోని ఓమినీ హాస్పిటల్‌లో చేరింది. వైద్యులు రోగికి గుండె ఆపరేషన చేసి అదనంగా రూ.70వేలు వసూలు చేశారని బంధువులు తెలిపారు. గత 15 రోజుల క్రితం ఓపెన హార్ట్‌ సర్జరీ చేసిన ప్రాంతంలో చీము పట్టడంతో రోగి ఓమినీ హాస్పిట ల్‌కు తీసుకువచ్చారు. ఇనఫెక్షన అయిందని, తగ్గుతుందని వైద్యు లు చెప్పి వెనక్కి పంపారు. అయితే కుట్లు వేసిన చోట ఇనపెక్షన తీవ్రం కావడంతో రోగిని వారం రోజుల క్రితం మళ్లీ హాస్పిటల్‌లో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఓపెన హార్ట్‌ సర్జరీ కోసం వచ్చిన ఆదిలక్ష్మి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ప్రాణాలు తీశారంటూ ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఓమినీ హాస్పిటల్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న మాట్లాడుతూ 40 రోజుల క్రితం ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రోగికి ఓపెన హార్ట్‌ సర్జరీ చేశారని, ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్‌ అయిన రూ.70వేలు వసూలు చేశారన్నారు. సర్జరీ చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో కుట్లు వేసిన చోట ఇనపెక్షన అయి రోగి చనిపోయిందన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:29 AM