పంచాయతీ భవనం కబ్జా
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 AM
మండలంలోని బైచిగేరి గ్రామంలో బస్ షెల్టర్ కోసం నిర్మించిన భవనాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏళ్లుగా చోద్యం చూస్తున్న అధికారులు
ఆదోని రూరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బైచిగేరి గ్రామంలో బస్ షెల్టర్ కోసం నిర్మించిన భవనాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ వ్యక్తి 6 సంవత్సరాల క్రితం భవాన్ని కబ్జా చేసి ప్రైవేటు మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇన్నేల్లు పట్టించుకోని అధికారలు ఇప్పడు కండ్లు తెరిసి నోటీసులు ఇచ్చామని సెలవిస్తున్నారు.
రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తాం
అది పంచాయతీ భవనం. అనుమతి లేకుండా ఓ వ్యక్తి మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. రెండు రోజుల్లో ఖాళీ చేయించి, భవనాన్ని స్వాధీనం చేసుకుంటాం. - నాగరాజు, పంచాయతీ కార్యదర్శి.
కబ్జాకు కాకుండా చూస్తాం
మండలంలోని ప్రభుత్వ భవనాలు కబ్జా కాకుండా చూస్తాం. బైచిగేరిలో కబ్జాకు గురైన పంచాయతీ భవనాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ చేసి, చర్యలు తీసుకుంటాం. - నూర్జహాన్, డీఎల్‌పీవో.