ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:20 AM
పట్టణంలో ప్ర భుత్వాసుపత్రి 1950లో నిర్మించారు. ప్రారంభమై 75 ఏళ్లయి నా ఇంతవరకు సిజేరియన్ కాన్పు చేసేందుకు పరికరాలు లేవు. వైద్యుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్యాంబాబు పరికరా లను తెప్పించి శనివారం ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభిం చారు
ప్రభుత్వాసుపత్రిలో పరికరాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే
పత్తికొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్ర భుత్వాసుపత్రి 1950లో నిర్మించారు. ప్రారంభమై 75 ఏళ్లయి నా ఇంతవరకు సిజేరియన్ కాన్పు చేసేందుకు పరికరాలు లేవు. వైద్యుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్యాంబాబు పరికరా లను తెప్పించి శనివారం ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభిం చారు. మండగిరి అగ్రహారం గ్రామానికి చెం దిన పద్మకు వై ద్యులు మొదటి సిజేరియన్ చేయగా, మగ పిల్లవాడు జన్మిం చాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హ యాంలో తన తండ్రి, ఎమ్మెల్యే కేఈ క్రిష్ణమూర్తి ఓపీ బ్లాక్ ను మంజూరు చేయించి, ఆధునీకరణ పనులను చేయించా రన్నారు. వైసీపీ హయాంలో పనులు నిలిచిపో యి, వైద్యప రికరాలు నిరుపయోగంగా మారాయి. వైద్యులు తన దృష్టికి తేవడంతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు కృషి చేశానని, వంద పడకలకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా మన్నారు.
పాలకవర్గ ప్రమాణ స్వీకారం..
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే శ్యాం బా బు, సభ్యులుగా వైద్యాధికారి, టీడీపీ నాయకులు సాంబ శి వారెడ్డి, న్యాయవాది సురేష్ కుమార్, బత్తిని లోక్‌నాథ్ ప్ర మాణస్వీకారం చేశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్, వైద్యులు, పాల్గొన్నారు.