అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:13 AM
శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

శ్రీశైలం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 15 న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈవో ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా మహగణపతి పూజ చేశారు. శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.