Share News

‘రోడ్డు పనులను అడ్డుకోవడం దారుణం’

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:56 AM

అనుమతుల పేరుతో రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం దారుణమని కేసీ కెనాల్‌ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి అన్నారు.

‘రోడ్డు పనులను అడ్డుకోవడం దారుణం’
అటవీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

మహానంది, మార్చి 10(ఆంధ్రజ్యోతి): అనుమతుల పేరుతో రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం దారుణమని కేసీ కెనాల్‌ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి అన్నారు. సోమవారం మహానంది నుంచి గాజులపల్లి మార్గంలో అధ్వానంగా ఉన్న రహదారిని ఆధునికీకరిస్తుండగా అటవీశాఖ అధికారులు పనులను అడ్డుకున్నారు. దీంతో కెసీ కెనాల్‌ అధ్యక్షుడితో పాటు ఎంపీపీ యశస్వీని, తెలుగుంగ ప్రాజెక్ట్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ క్రాంతికుమార్‌తో పాటు టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి చంద్రమౌలీశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ డీఆర్వో హైమావతితో పాటు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని రహదారి ఆధునికీకరణ పనులను చేస్తుండగా అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. అడ్డుకోవడానికి గల ఆధారాలను చూపాలన్నారు. అటవీ సిబ్బంది సమాధానం తెలపక పోవడంతో తిరిగి రహదారి పనులను ప్రారంభించారు.

Updated Date - Mar 11 , 2025 | 12:56 AM