మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీఆర్
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:09 AM
మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి పురుషులతో పాటూ మహిళలకు హక్కు కలిగించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు కల్చరల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి పురుషులతో పాటూ మహిళలకు హక్కు కలిగించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీనటరాజ నృత్య కళామందిరం, టీజీవీ కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళ లకు కళాసౌరభ ‘నారీశక్తి పురస్కారాలు’ ప్రదానోత్సవం చేశారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్ర మంలో ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐలు ఎం.ఆదిలక్ష్మి, ఎల్. విజయరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం సీఐలు ఎం. ఆదిలక్ష్మి, విజయరెడ్డి, ఇతర రంగాల్లో రాణిస్తున్న కౌన్సిలింగ్ సైకాలజిస్టు జ్యోతిర్మయి, ప్రొఫెసర్ ఎస్‌వీ సునీత, జ్ఞానేశ్వరి, వై. మల్వేశ్వరమ్మ, దండే స్వప్నశ్రీ, ఎ.జయలక్ష్మి, డాక్టర్ విద్యా వాసిని, అనితాదేవి, సోమి శెట్టి సరళ, మాధవీలత, సరోజ, నాగమల్లేశ్వరి, డాక్టర్ కె. చంద్రమౌళిని, బి.రాణి లీలావతి, రమ్యబాయి తదితరులను శాలువ, పూలదండ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటరాజ నృత్య కళామందిరం అధ్యక్షుడు ఎస్.కరీముల్లా, కార్యదర్శులు డాక్టర్ బీవీ స్వరూప్‌సిన్హా, కేపీఆర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.