మోడల్ స్కూళ్లలోప్రవేశాలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:33 AM
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 24వ తేదీ నుంచి నెట్ బ్యాంకింగ్/ క్రిడిట్/ డెబిట్ కార్డుల ద్వారా అన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు
నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఆలూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 24వ తేదీ నుంచి నెట్ బ్యాంకింగ్/ క్రిడిట్/ డెబిట్ కార్డుల ద్వారా అన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది.
ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష
6వ తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరి గానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖా స్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్టు అదే రోజు సెలక్షన్ లిస్టును సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు కౌన్సెలింగ్ ప్రక్రి యను చేపడతారు.
సీట్ల కోసం తీవ్ర పోటీ
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఈ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనున్నాయి.
కర్నూలు, జిల్లాలో ఆలూరు, పుట్టకలమర్రి (ఆస్పరి), కోడుమూరు, రచ్చుమరి (మంత్రాలయం), ముగతి (నందవరం), కడివెళ్ల (ఎమ్మిగనూరు), పెద్దకడబూరు, కోసిగి), మద్దికెర, పత్తికొండ
పెద్దపాడు(కల్లూరు), ఓర్వకల్లు, (కృష్ణగిరి), జుల్లేకల్ (గూడూరు) సి.బెళగల్, గోనెగండ్ల, నంద్యాల జిల్లాలో గడివేముల, సంద్యాల, ఆళ్లగడ్డ బేతంచెర్ల పాణ్యం, పాములపాడు, డోన్, గోస్పాడు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మిడుతూరు, జాపుడుబంగ్లా, సిరివెల్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, ఉయ్యాలవాడ, పగిడ్యాల, బనగానపల్లి, మహానంది (తిమ్మాపురం).
పాఠశాలల్లో ఒక్కో చోట 100 సీట్ల చొప్పున ..
6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కూలాలకు చెందిన విద్యార్థులు 2018 సెప్టెంబరు 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.150 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబరు 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.75 సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023-24, 2024-25 సంవత్సరాల్లో 4.5 తరగతుల్లో చదివి ప్రమోషన్‌కు అర్హత పొంది ఉండాలి. పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజిర్వేషన్ ప్రతిపాదికన సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం అబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్ష తెలుగు/ ఇంగ్లీష్ మీడియంలో రాయవచ్చు. విద్యార్థులు సీఎస్‌ఈ.గవర్న్‌మెంట్. ఇన్, ఏపీఎమ్‌ఎస్. ఏపీ.గవర్నమెంట్.ఇన్‘ వెబ్ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియం లోనే విద్యా భోదన, విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య, బయాలజీ, పిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తిస్థాయి సౌకర్యాలు ఉన్నారు
కార్పొరేట్ విద్య
గ్రామాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలని మో డల్ స్కూళ్లను తీసుకొ చ్చారు. ఇంగ్లీషు మీడియంలో బోధన ఉంటుంది. ఇంజీనీరింగ్, మెడిసిన్ కోర్సులకు సిద్ధం చేస్తున్నాం.
- శ్యామ్యూల్ పాల్, డీఈవో, కర్నూలు