Share News

ఉపయోగపడని ల్యాబ్‌

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM

రైతులకు మెగైన సేవలందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం అగ్రిల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీని నిర్వహ ణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపో వడంతో సిబ్బంది ఇష్టరాజ్యంగా వ్యవహ రిస్తున్నారని అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఉపయోగపడని ల్యాబ్‌
ఆలూరు పట్టణంలోని అగ్రిల్యాబ్‌

ఆలూరులో నామమాత్రంగా అగ్రిల్యాబ్‌ సేవలు

అందుబాటులో ఉండని సిబ్బంది

ల్యాబ్‌ సేవలపై రైతులకు అవగాహన కన్పించడంలో నిర్లక్ష్యం

ఆలూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రైతులకు మెగైన సేవలందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం అగ్రిల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీని నిర్వహ ణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపో వడంతో సిబ్బంది ఇష్టరాజ్యంగా వ్యవహ రిస్తున్నారని అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.

గత వైసీపీ హయాంలో ప్రారంభం

ఆగ్రిల్యాబ్‌ల ద్వారా భూసార పరీక్షలు, పశు సంవర్ధక శాఖ పరీక్షలకు, ఆక్వా కల్చర్‌ అబివృ ద్ధిలో భాగంగా టెస్టింగ్‌ ల్యాబ్‌లను గత ప్రభుత్వంలో ఆలూరులో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఎన్నికల ముందు హడావుడిగా మార్కెట్‌ యార్డులో రూ.1.50 కోట్లతో నిర్మించిన అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆచరణలో మాత్రం లక్ష్యాన్ని అధిగమించలేదు.

సర్దుబాటులో ద్వారా సిబ్బంది

అగ్రి ల్యాబ్‌కు సిబ్బందిని నియమించకుండా వ్యవసాయ శాఖలోని వారినే ఇక్కడికి సర్దుబాటు చేశారు. అలాగే ల్యాబ్‌కు అటెండర్‌, వాచ్‌మెన్‌ కూడా లేడు. దీంతో ల్యాబ్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

సిబ్బంది ఇష్టారాజ్యం

ల్యాబ్‌లో పనిచేసే సిబ్బందికి బయోమెట్రిక్‌ కానీ, ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ కానీ లేవు. దీంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. దీంతో సేవల కోసం వచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. సమావేశాలు ఉన్నాయం టూ పత్తా లేకుండా పోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నామమాత్రపు సేవలు..

ఆలూరు పట్టణంలో అగ్రి ల్యాబ్‌ అంటూ ఒకటి ఉందని కూడా రైతులకు తెలియదు. రైతులకు అందించే సేవలపై గ్రామాల్లో అధికారులు కనీసం అవగాహన కూడా కల్పించడం లేదని సమాచారం. అగ్రిల్యాబ్‌ నామమాత్రంగా మిగిలిపోయింది.

అందించాల్సిన సేవలు..

అగ్రి ల్యాబ్‌లో భూసార పరీక్షలు, పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు సూచనాలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం ఉచితంగా కల్పించే సేవలు. రైతులు నేరుగా గాని, వ్యవసాధికారుల ద్వారా గాని భూసార పరక్షలు చేయించుకోవచ్చు. అలాగే విత్తనాల నాణ్యతను కూడా తెలుసుకోవచ్చు.

ఈ విషయంపై ల్యాబ్‌ ఇన్‌చార్జి దేవభూషణ్‌ను వివరణ కోరగా రైతులకు సలహాలు ఇస్తున్నామని, విత్తనాల నాణ్యత విషయంలో కూడా ఇక్కడే పరీక్షలు చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.

రైతులకు అందుబాటులోకి తేవాలి

రూ.కోట్లు వెచ్చింది నిర్మించిన ఆగ్రి ల్యాబ్‌ను రైతులకు అందుబాటులోకి తేవాలి. ఇక్కడి సేవల గుఇరంచి కరపత్రాల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తేనే ఉపయోగం. సిబ్బంది ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. - నారాయణ రెడ్డి, తెలుగు రైతు నాయకుడు, ఆలూరు

Updated Date - Feb 07 , 2025 | 11:54 PM