Share News

ఉత్తుత్తి వైద్యం

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:25 AM

: మండల కేంద్రంలోని ఖస్త్రయునానీ వైద్యశాలలో మందులు లేవు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. యూ నానీ మందులు వాడితో రోగం నమమవుతుందని వస్తే తీరా ఇక్కడ మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

ఉత్తుత్తి వైద్యం
పీహెచ్‌సీలోనే యునానీ వైద్యశాల

మందులు లేవని, తర్వాత ఇస్తామంటున్న వైదులు

సొంత భవనం లేక పీహెచ్‌సీలోనే నిర్వహణ

కొత్తపల్లి యునానీ వైద్యశాల దుస్థితి

కొత్తపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఖస్త్రయునానీ వైద్యశాలలో మందులు లేవు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. యూ నానీ మందులు వాడితో రోగం నమమవుతుందని వస్తే తీరా ఇక్కడ మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

ఇండెంట్‌ పట్టినా..

వైద్యాధికారి జమాలుద్దీన్‌ మందుల సరఫరా కోసం ఇండెంట్‌ పెట్టామని మందులు వస్తాయంటు న్నారు గాని ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు.

ఇరుకు గదిలో..

యునాని వైద్యశాలకు సొంత భవనం లేదు. దీంతో కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఒక చిన్న ఇరుకు గదిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ యునానీ వైద్యశాల ఉందన్న విషం రోగులకు తెలియడం లేదు. గతంలో వైద్యశాలకు ఫర్నీచర్‌ రాగా, ఇక్కడ ఉంచే అవకాశం లేకపోవడంతో పీహెచ్‌సీ వైద్యులే ఉపయోగించుకుంటున్నారు.

15 రోజుల్లో మందులు

కొన్నేళ్లుగా యునానీ వైద్యశాలలకు మందుల్లేని మాట వాస్తవమే. ఇటీవల ఈ విషయాన్ని కొత్తగా వచ్చిన ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. యునానీ మందులను కొనుగోలు చేసి 15 రోజుల్లో అన్ని వైద్యశాలలకు మందులు సరఫరా చేస్తాం - శేఖర్‌ రాజు, యునానీ రీజనల్‌ డైరెక్టర్‌, కడప

Updated Date - Feb 01 , 2025 | 01:25 AM