Share News

దళితవాడపై శీతకన్ను

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:21 AM

నంద్యాల పట్టణానికి కేవలం ఐదు కి.మీ.ల దూరంలోని బిల్లలాపురం గ్రామ దళివాడను ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మురుగు కుంటలా తయారైందని, విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయని సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

దళితవాడపై శీతకన్ను
మురుగు కుంటలా మారిన ప్రధాన రహదారి, ఇన్‌సెట్‌లో ఒరిగిన విద్యుత్‌ స్తంభం

కాలువలు లేక రోడ్డుపైనే మురుగు ఫ ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలు

పారిశుధ్య పనులు చేయడం లేదని గ్రామస్థుల ఆరోపణ

నంద్యాల రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బిల్లలాపురం గ్రామం దళితవాడ అభివృద్ధికి దూరంగా ఉంది. దాదాపు 100 గృహాలు ఉండగా, 400మంది వరకు నివసిస్తున్నారు. తమ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

పారిశుధ్యపనులు లేవు..

ఇంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నా తమ కాలనీలో పారిశుధ్య పనులు, ఫాగింగ్‌ కూడా చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మురుగులోనే వెళ్లాలి..

గ్రామంలోకి వెళ్లాలంటే దళితవాడ మీదే వెళ్లాలి. నిత్యం అధికారులు తిరుగుతున్నా స్పందించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

రోడ్డుపైనే మురుగు..

గతంలో కాలువల నిర్మాణానికి తవ్వి పనులు చేయకుండా వదిలేశారు. దీంతో అవి కనుమరుగయ్యాయి. కాలువలు పూడిపోయి చెట్లు మొలిచి మరు గు ముందుకు పోవడం లేదు. కొత్తపల్లెకి వెళ్లే ప్రధాన రహదారి మురుగు గుం టలా ఉంది. విద్యుత్‌ స్థంభాలు కూడా ఒరిగిపోయాయి. - పాములేటి, స్థానికుడు.

Updated Date - Feb 24 , 2025 | 12:21 AM