నవరత్నాల రథోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:49 PM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహ రించారు.

మంత్రాలయం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహ రించారు. శుక్రవారం పుష్పమాసం చవితి శుభ దినాన్ని పురస్కరించు కుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాఽఽధిపతి పూర్ణ బోధ పూజ మందిరంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రో చ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య నవరత్నాల రథం పై వజ్రా లు పొదిగిన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధి పతి హారతులు ఇచ్చిన అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగిం చారు. ఉత్సవమూర్తికి ఊంజలసేవ నిర్వహించి హరతులిచ్చారు. వివిధ రాషా్ట్రల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన భక్తులకు పీఠాధిపతి సుబుఽఽధేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు.