నరసింహారెడ్డి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:52 PM
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని జాయింట్ కలెక్టర్ బి.నవ్య పేర్కొన్నారు.
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని జాయింట్ కలెక్టర్ బి.నవ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం 178వ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని పురస్కరించు కుని కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప విప్లవకా రుడు అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏ మాత్రం భయప డకుండా హక్కుల కోసం ఆయన చూపిన పోరాట పటిమ, వీరత్వం, పౌరుషం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమం లో డీఆర్వో సీ. వెంకటనారాయణమ్మ, కార్పొరేషన కమిషనర్ రవీంద్ర బాబు, డీఎంహెచవో శాంతికళ, పర్యాటక శాఖ అధికారి విజయ, మెఫ్మా పీడీ నాగశివలీల, ఎంప్లాయిమెంట్ అధికారి దీపి పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన: స్థానిక బీ.క్యాంపులోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. కళాశాలలో శనివారం నరసింహారెడ్డి చిత్రపటానికి ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, నైస్ కంప్యూటర్ సంస్థ నిర్వాహకుడు ఆర్.శ్రీనివాస్, అధ్యాపకులు పూలమా లలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు, అధ్యాప కుడు విజయశేఖర్ పాల్గొన్నారు.