నా మాట అంటే లెక్కేలేదా..?
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:01 AM
నా మాట అంటే లెక్కేలేదా.. నేను మాట్లాడుతుంటే సెల్‌పోన చూస్తావా.. నేను చెప్పినదేంటీ.. మీరు చేస్తున్నదేంటీ.. అని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్
ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తనిఖీ
కోసిగి జనవరి 29(ఆంధ్రజ్యోతి): నా మాట అంటే లెక్కేలేదా.. నేను మాట్లాడుతుంటే సెల్‌పోన చూస్తావా.. నేను చెప్పినదేంటీ.. మీరు చేస్తున్నదేంటీ.. అని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను ఆయన తనిఖీ చే శారు. నిరూపయోగంగా ఉన్న వర్మీ కంపోస్టును తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెబితే పట్టించుకోరా అంటూ ఈవోపీఆర్‌డీ హరూన రషీద్‌పై సబ్‌కలెక్టర్ మండిపడ్డారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని సూచించినా చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థులకు హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్టల్ ఆవరణంలో పందులు సంచరిస్తున్నా మీకు కని పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వచ్చినప్పుడు సమస్యలు అలాగే ఉంటే మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ ఇన్సపెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుసూర్య, తహసీ ల్దార్ రుద్రగౌడు, వీఆర్వో బసవరాజు ఉన్నారు.
రీసర్వే పనుల తనిఖీ : మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ తని ఖీ చేశారు. బుధవారం గ్రామంలో క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రీసర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వే చేయాలన్నారు. అలాగే సచివాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలోని భూవిస్తీర్ణం, రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన: మండలంలోని ఐరంగల్ గ్రామ సమీపంలో ఉన్న రైల్వేస్టేషన పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, రైల్వే ఇంజనీర్ ఉమా పతి, డిప్యూటీ ఇన్సపెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుసూర్య, కోసిగి తహసీల్దార్ రుద్రగౌడు ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, వీఆర్వోలు బసవ, రైల్వే, రెవెన్యూ అధికా రులు, రైతులు ఉన్నారు.