Share News

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:25 PM

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
జూపాడుబంగ్లా పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

డీఈఓ జనార్దన్‌ రెడ్డి

జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం జూపాడుబంగ్లా, ఆత్మకూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలపై భయం వీడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను విభజించి సీ గ్రేడు ఉన్న విద్యార్థులను ఏ గ్రేడులోకి తీసుకొచ్చి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం తక్కువ వచ్చే పాఠశాలలు, ఆయా అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Feb 11 , 2025 | 11:25 PM