Share News

రసాభాసగా కౌన్సిల్‌..

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:30 AM

మున్సిపల్‌ కైన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. శుక్రవారం చైర్పర్సన్‌ వాల్మీకి శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

రసాభాసగా కౌన్సిల్‌..
మహిళా కౌన్సిలర్ల వాగ్వావాదం

బీజేపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వావాదాలు

గందరగోళంగా సమావేశం

అజెండా చర్చ లేకుండానే వాయిదా

ఆదోని టౌన్‌, జనవరి31 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కైన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. శుక్రవారం చైర్పర్సన్‌ వాల్మీకి శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. 35వ వార్డు అమరావతి నగర్‌ కౌన్సిలర్‌ వెల్లాల లలితమ్మ మాట్లాడుతూ తన వార్డు పనులను కావాలనే వాయిదా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ, వేధింపులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆమెను సమావేశం నుండి బయటికి పంపాలని వైస్‌ చైర్మన్‌ నరసింహులు చెప్పడంతో చైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించారు. ఆమెకు మద్దతుగా బీజేపీకు మద్దతుదారులుగా ఉన్న కౌన్సిలర్లు చిన్నా, సురేష్‌, పద్మావతమ్మ కూడా బైఠాయించారు. ఒక సందర్భంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక గందరగోళ పరిస్థితి కనిపించింది. కౌన్సిలర్‌ రఘు మాట్లాడుతూ, వైసీపీ నుంచి గెలిచి బీజేపీకి మద్దతు తెలుపుతున్న వారు రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కౌన్సిలర్‌ బాలాజీ మాట్లాడుతూ, కొందరు పారిశుధ్య కార్మికులు ఇతరులతో పనులు చేయిస్తున్నా రని, గుర్తింపు కార్డులు ఇస్తే పనిదొంగలు బయట పడతారని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లోని 58 సీసీ కెమెరాలలో 8 మాత్రమే పని చేస్తున్నాయని, మరమ్మతులు చేయాలని లేకపోతే కొత్తవి అమరా3్చలన్నారు. చివరకు అజెండాలోని 7 అంశాలను చర్చించకుండానే వాయిదా వేశారు. సమావేశంలో కమిషనర్‌ కృష్ణ, అసిస్టెంట్‌ కమీషనర్‌. డా అనుపమ, ఎంఈ ఇంతియాజ్‌ అలీ, ఏసీపీ కృష్ణ సింగ్‌, డీఇలు గోపినాథ్‌, రామమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 01:30 AM