Share News

హంద్రీనీవా కాలువ విస్తరణకు ఉద్యమం

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:23 AM

హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణకు ఐక్య ఉద్యమాలు చేపడదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు.

 హంద్రీనీవా కాలువ విస్తరణకు ఉద్యమం
మాట్లాడుతున్న రామచంద్రయ్య

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణకు ఐక్య ఉద్యమాలు చేపడదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు. శనివారం శాంతి పాఠశాల ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌ అధ్యక్షత వహించారు. రాయలసీమ వరప్రసా దాయని హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల జనా భాకు తాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు సక్రమంగా పూర్తి కాకపోవడంతో ఆయకట్టు సాగులోకి రాలేదన్నారు. పందికోన రిజర్వాయర్‌ ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేస్తే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు తిరుపాలు, వైసీపీ నాయకుడు సోమశేఖర్‌, సీపీఎం కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:23 AM