Share News

మూల పెద్దమ్మ జాతరను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:12 AM

మండల కేంద్రంలో ఈనెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు జరిగే మూలపెద్దమ్మ జాతరను విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దేవదాయశాఖ అధికారులకు సూచించారు.

మూల పెద్దమ్మ జాతరను విజయవంతం చేయాలి
ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

గడివేముల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఈనెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు జరిగే మూలపెద్దమ్మ జాతరను విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కర్నూలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు వెంకట్‌రెడ్డి, గౌరుజనార్దన్‌రెడ్డి ఆదివారం అమ్మవారి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ ఈవో రామలింగారెడ్డి, ఫెస్టివల్‌ కమిటీ సభ్యులు రమణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, నరేంద్రారెడ్డి, దేవదాయ శాఖ సిబ్బంది రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:12 AM