Share News

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌తో మంత్రి బీసీ భేటీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:50 PM

తాడిపత్రిలోని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డితో రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌తో మంత్రి బీసీ భేటీ
తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయిన రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఫిబ్రవరి 3 ఆంధ్రజ్యోతి): తాడిపత్రిలోని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డితో రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నాపరాయి గనుల సమస్యలపై చర్చించారు. తాడిపత్రి, బనగానపల్లె మండలంలో నాపరాయి పరిశ్రమలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వారు వివరించుకున్నారు. నాపరాయి పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు తగ్గించేలా కృషి చేయాలని కోరారు. అలాగే నాపరాయి పరిశ్రమ సంక్షోభంలో ఉందని, ఆదుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. అనంతరం ఆర్‌ఆండ్‌బీ శాఖాధికారులతో ఇరువురు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా చేపట్టిన మరమ్మతులు, ఇతర రోడ్ల పనులపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ఏపీలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రూ.1060 కోట్లు ఖర్చు పెట్టి 88 శాతం రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పీపీపీ మోడల్‌లో రాష్ట్రంలో రూ.3 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత సీఎం జగన్‌ నిర్వాకంతో రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోవడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి కుంటుబడిందని తెలిపారు. నేడు సీఎం చంద్రబాబునాయుడుపై భరోసాతో ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారీ సంఖ్యలో వస్తున్నారన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ప్రజలు పట్టం కట్టారన్నారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:50 PM