Share News

వాహనాల పార్కింగ్‌ నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:51 AM

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నా రని, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు.

వాహనాల పార్కింగ్‌ నియంత్రణకు చర్యలు
ప్కారింగ్‌ చేసిన వాహనాలను పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నా రని, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ఆయన సీఎస్‌ఆ ర్‌ఎంవో బి.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ర్టేటర్‌ సింధు సుబ్రహ్మ ణ్యం తో కలిసి ఆస్పత్రిలో రౌండ్స్‌ నిర్వహించారు. గైనిక్‌ విభాగం దగ్గర ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉండేటట్లు చూసు కోవాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని పెయింగ్‌ బ్లాక్‌ ఇతర వార్డులో వాటర్‌ లీకేజీ అవుతున్నాయని, వీటికి మరమ్మతులు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రోగులకు ఇస్తున్న భోజనాన్ని సూపరింటెండెంట్‌ పరిశీలించారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ అడ్మినిస్ర్టే టర్స్‌ డా.కిరణ్‌ కుమార్‌, న్యూడ యోగ్నస్టిక్‌ బ్లాక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా.సునీల్‌ ప్రశాంత, ఆసుపత్రి ఏడీ మల్లేశ్వరి, నర్సింగ్‌ సూపరిం టెండెంట్‌ సావిత్రీబాయి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:51 AM