Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:44 PM

ఏపీ మోడల్‌ స్కూల్‌లో, జూనియర్‌ కాలేజీలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఎస్‌.సలీం బాషా, జీసీడీవో స్నేహలత అన్నారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి
కోసిగి మోడల్‌ స్కూల్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సలీం బాషా

కోసిగి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏపీ మోడల్‌ స్కూల్‌లో, జూనియర్‌ కాలేజీలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఎస్‌.సలీం బాషా, జీసీడీవో స్నేహలత అన్నారు. గురువారం కోసిగిలోని మోడల్‌ స్కూల్‌లో రికార్డులను పరిశీలించి విద్యార్థుల తరగతి గదులను, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు గుర్తించి వారిపై పర్యవేక్షణ ఉంచాలన్నారు. అలాగే ఎన్‌ఎంఎంస్‌ పరీక్షకు మెలకువలు విద్యార్థులకు తెలియజేశారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలో సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సుందర్‌ కుమార్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

కేజీబీవీ తనిఖీ: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు కృషి చేయాలని జీసీడీవో స్నేహలత సూచించారు. కోసిగిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులు రాస్తున్న పరీక్షలను పరిశీలించి విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌ షబానా అజ్మిన్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

‘కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉండాలి’

మంత్రాలయం: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు విద్యాబోధన సాగాలని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సలీంబాషా, జీసీడీవో అధికారి స్నేహలత అన్నారు. గురువారం మంత్రాలయం మండలంలోని రచ్చమర్రి మోడల్‌ పాఠశాలను ప్రిన్సిపాల్‌ అశోక్‌నాయక్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారిహాజరు, విద్యాబోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రసాద్‌, నళని, సోమలింగం, షరీఫ్‌వళి, వైష్ణవి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:44 PM