Share News

పాదయాత్రను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:54 PM

జై బాపూజీ, జై భీమ్‌, జై సంవిధాన పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పీ.మురళీకృష్ణ అన్నారు.

పాదయాత్రను విజయవంతం చేయండి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ

కర్నూలు అర్బన, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జై బాపూజీ, జై భీమ్‌, జై సంవిధాన పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పీ.మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర మంత్రి అమితషా పార్లమెంట్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 22న జిల్లాలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోయే పాదయాత్రలో కాంగ్రెస్‌ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10:30 గంటలకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం నుంచి నెహ్రూరోడ్డు, చౌక్‌బజార్‌, గడియారం హస్పిటల్‌, పెద్ద మార్కెట్‌ మీదుగా పాత బస్టాండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, షేక్‌ జిలానీ బాషా, సంబశివుడు, లాజరస్‌, దేవిశెట్టి ప్రకాష్‌, బజారన్న, వెంకట సుజా త, శ్రీలత, ప్రమీల పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:54 PM