Share News

ప్రతిపాదనలు తయారు చేయండి

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:10 AM

జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌ ఆదేశించారు.

 ప్రతిపాదనలు తయారు చేయండి
జిల్లా కోర్టు సముదాయాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో విశ్వనాథ్‌

పాణ్యం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌ ఆదేశించారు. గురువారం కౌలూరు పరిధిలోని 126 సర్వే నెంబరులో నిర్మింపతలపెట్టిన జిల్లా కోర్టు సముదాయానికి అవసరమైన 10. 7 ఎకరాలను పరిశీలించారు. స్థల వివరాల నివేదికలు తయారుచేసి కోర్టు స్థల నిర్మాణానికి ప్రతిపాదనలు వెంటనే తయారు చేయాలని తహసీల్దారు నరేంద్రనాథ్‌ రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామచంద్రారావు, సర్వేయర్‌ ఆనంద్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:10 AM