మహనీయుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:31 PM
బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేసి రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొ న్నారు.

కర్నూలు అర్బన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేసి రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొ న్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఈ ప్రభాకర్, సీనియర్ నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఉన్న కాంస్యవిగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత దేశంలో మరెవరికీ లేదన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా సభ్యత్వం చేసుకోవడం గర్వ కారణంగా ఉందన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ఆయన ఆశయసాధన కోసం సీఎం నారా చంద్ర బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సమన్యా యం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంద్యాల నాగేంద్ర, కేఈ జగదీష్, సోమిశెట్టి నవీన్, కేవీ సుబ్బారెడ్డి, కైప పద్మలతా రెడ్డి, అబ్బాస్, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరీ, జేమ్స్, ఎల్లప్ప పాల్గొన్నారు.