Share News

సూర్యప్రభ వాహనంపై మహానందీశ్వరుడు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:05 AM

మహానంది క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

సూర్యప్రభ వాహనంపై మహానందీశ్వరుడు
మహానందిలో సింహ వాహనంపై గ్రామోత్సవం

స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం

మహానందిలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

మహానంది, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. యఽథావిధిగా ఆలయంలో వేదపండితులు, రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు ఆలయవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవం ముందు కర్ణాటక భక్తులు నిర్వహించిన నంది కోల నృత్యాలు పలువురిని ఆకట్టుకన్నాయి. అలాగే రాత్రి సింహ వాహనంపై గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఉత్సవాల ప్రత్యేక అధికారి రామాంజనేయిలు, ఏఈఓ యర్రమల్ల మధు, పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, దేవికలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బందోబస్తును పరిశీలించిన ఏఎస్పీ: మహానంది శివరాత్రి ఉత్సవాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసారు. మంగళవారం నంద్యాల ఏఎస్పీ జావళి ఆలయ పరిసరాల్లో బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డితో ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ రామ్మోహాన్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు మహానందిలో జాగరణ..... లింగోద్భవ పూజలు:

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహానందిలో భక్తులు జాగరణ చేస్తారు. ఆలయంలో లింగోద్భవ పుణ్యకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం కల్యాణం నిర్వహిస్తారు.

Updated Date - Feb 26 , 2025 | 12:06 AM