మహానందీశ్వరుడి సన్నిధిలో న్యాయాధికారి
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:17 AM
మహానంది క్షేత్రంలో నంద్యాల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు జరిపారు.
మహానంది, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో నంద్యాల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు జరిపారు. గురువారం ఆలయ ముఖ మండపం వద్ద న్యాయాధికారికి ఆలయ పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో మహానందీశ్వరునికి, కామేశ్వరీదేవి అభిషేకార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో వీరిని వేదపండితులు నౌడూరి నాగేశ్వరశర్మ ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు.