ఇంటింటి సర్వేలో న్యాయాధికారి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:24 AM
కొత్తబస్టాండు సమీపం లోని ఇల్లూరు నగర్ నుంచి ఇందిరాగాంధీ నగర్ వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువా రం ఇంటింటి సర్వే నిర్వహించారు.

కర్నూలు లీగల్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కొత్తబస్టాండు సమీపం లోని ఇల్లూరు నగర్ నుంచి ఇందిరాగాంధీ నగర్ వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువా రం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇళ్లలో ఎవరైనా బాలబాలికలు మానసిక వైకల్యంతోగాని, అంగవైకల్యంతోగాని ఉన్నట్లయితే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాము ఈ సర్వేను నిర్వహిస్తున్నామనీ పారా లీగల్ వలంటీర్లు, న్యాయ వాదులు, ఆశా వర్కర్లు, ఏఎనఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందాలు ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరి స్తారని తెలిపారు. శారీరక, మానసిక, వినికిడీ, గ్రహణమొర్రి సమస్యలతో బాధ పడుతున్న పిల్లలను గుర్తించి వారిని డీఈఐసీ సెంటర్ల ద్వారా ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పి.నిర్మల, పి.శివసుదర్శన, రాయపాటి శ్రీనివాసులు, సౌమ్య పాల్గొ న్నారు.
పట్టణ నిరాశ్రయుల వసతి గృహం తనిఖీ : స్థానిక ఇందిరా గాంధీనగర్‌లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం తనిఖీ చేశారు. వసతి గృహానికి సంబంధించిన అందిస్తున్న సౌకర్యాలను, అక్క డి పరిస్థితులను ఆయన పరిశీలించారు.