Share News

ఏజెంట్ల జాబితా ఇవ్వాలి: ఆర్డీవో

ABN , Publish Date - May 08 , 2025 | 12:08 AM

నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను నియమించి ఆ జాబితాను తమకు ఇవ్వాలని ఆయా పార్టీల ప్రతినిధు లను ఆత్మకూరు ఆర్‌డీవో నాగజ్యోతి సూచించారు.

 ఏజెంట్ల జాబితా ఇవ్వాలి: ఆర్డీవో
మాట్లాడుతున్న ఆర్డీవో నాగజ్యోతి

నందికొట్కూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను నియమించి ఆ జాబితాను తమకు ఇవ్వాలని ఆయా పార్టీల ప్రతినిధు లను ఆత్మకూరు ఆర్‌డీవో నాగజ్యోతి సూచించారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బీఎల్‌వోలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలో డబుల్‌ ఓట్లు లేకుండా చర్యలు తీసు కోవాలన్నారు. త్వరలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తామని, ఆ సమయంలో డబుల్‌ ఓట్లు ఉంటే ఆబీఎల్‌వోపై చర్యలు ఉంటాయని ఆమె తహసీల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధులు షకీల్‌ అహ్మద్‌, ఓబుల్‌రెడ్డి, త్యాగరాజు, సీపీఎం ప్రతినిధులు నాగేశ్వరరావు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:08 AM