వేగం కన్నా ప్రాణం ముఖ్యం : డీఎస్పీ
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:25 AM
వేగం కన్నా ప్రాణం ముఖ్యమని ట్రాఫిక్ నియమాలను పాటించాలని డీఎస్పీ హేమలత సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీసులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఆదోనిలో పోలీసుల బైక్ ర్యాలీ
ఆదోని, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వేగం కన్నా ప్రాణం ముఖ్యమని ట్రాఫిక్ నియమాలను పాటించాలని డీఎస్పీ హేమలత సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీసులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రాణాన్ని కాపాడు కోవడానికి హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల డ్రైవర్లు సీట్ బెల్టు ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని అన్నారు. వాహనా లను నడిపే టప్పుడు కుటుంబం మనకోసం ఎదురుచూస్తుం టారని, వారికి మనమే ఆధారం అని గుర్తించుకో వాలన్నారు. సీఐలు శ్రీరామ్, సూర్యమోహన్ రావు, ఘంటా సుబ్బారావు, రామలింగయ్య, నల్లప్ప పాల్గొన్నారు.