రక్తదానంతో ప్రాణదానం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:28 PM
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లెలో రక్తదాన శిబిరం
బనగానపల్లె, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బనగానపల్లెలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మరొకరి జీవితంలో వెలుగు నింపుతుందన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలువాలని కోరారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు, బలహీన వర్గాలకు అనేక పదవులు ఇచ్చారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్ణాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారకరామారావుదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టంగుటూరు శ్రీనయ్య, ఉపసర్పంచ్ బురానుద్దీన్, మౌళీశ్వరరెడ్డి, ఇస్మాయిల్‌ఖాన్, తిరుమలయ్య, నాగేంద్రారెడ్డి, కృష్ణానాయక్, పూలకలాం, భూషన్న, దివాకర్‌రెడ్డి, జంగంశెట్టి, ప్రసాద్, ఖాదర్ పాల్గొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్
నంద్యాల కల్చరల్, జనవరి 18: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ పేద ప్రజల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం నిస్వార్థంగా పనిచేసి పేదల గుండెల్లో నిలిచిన మహనీయుడు ఎనీఆర్ అన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, నాయకులు బాబన్, జిల్లెల్ల శ్రీరాములు, డాక్టర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.