Share News

కార్మిక హక్కులను కాలరాస్తే ఊరుకోం

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:42 PM

కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని సీఐటీయూ నాయకులు జయరాజు అన్నారు.

కార్మిక హక్కులను కాలరాస్తే ఊరుకోం
లేబర్‌ కోడ్‌ ప్రతులను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు

సీఐటీయూ నాయకులు

మంత్రాలయం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని సీఐటీయూ నాయకులు జయరాజు అన్నారు. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర బడ్జెట్‌, లేబర్‌ కోడ్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలనలో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికుల స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కుతుందని ఆరోపించారు. కార్యక్ర మంలో సీఐటీయూ మండల కార్యదర్శి భీమేశ్వరి, అంగనవాడీ కార్మి కులు శ్వేత, ప్రమీల, భవన నిర్మాణ కార్మికులు లక్ష్మన్న, ఇజ్రాయేలు, సురేష్‌, వీరన్న, మారెప్ప, ప్రాణేష్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కోసిగి: కోసిగి వాల్మీకి సర్కిల్‌లో బుధవారం సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి రాముడు, రైతు సంఘం మండల కార్య దర్శి వీరేష్‌, అంగనవాడీ సంఘం నాయకులు హెబ్సిబారాణి, లూసమ్మ, వరలక్ష్మి, కేవీపీఎస్‌ నాయకులు హనుమంతు, ఆటో యూనియన నాయ కులు చిన్నన్న, చిన్నారెడ్డి పాల్గొన్నారు.

నందవరం: మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసర ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులు రాముడు, ఉరుకుందు మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, భాగ్యమ్మ, రామలింగమ్మ, వెంకటేశ్వ రమ్మ, కోదండ, చిన్నఏసున్న, తిమోతి, శివ, జయన్న, ఆనందు, వెంక టస్వామి, బజారి పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని వామపక్ష సంఘాల నాయ కులు డిమాండ్‌ చేశారు. బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో ధర్నా చేపట్టి లేబర్‌ కోడ్‌ జీవో పత్రు లను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పంపన్నగౌడు, తిమ్మ గురుడు, గోవిందు, రాముడు, కేసీ జబ్బార్‌, నరస య్య, బజారి, విజ యేంద్ర, మహేంద్ర, దాదావలి, మల్లికార్జునగౌడు, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 11:42 PM