ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:46 PM
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఆదోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి బాలకృష్ణారెడ్డి అన్నారు.
కౌతాళం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఆదోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి బాలకృష్ణారెడ్డి అన్నారు. కౌతాళంతో పాటు మండల పరిధిలోని ఎరిగేరి, కామవరం, ఉరుకుంద గ్రామాల పంచాయతీలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ అధికారులు గ్రామాల్లో చెత్తకుప్పలు పేరుకుండా ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, వర్మీకంపోస్ట్ తయారీ, గ్రీన్ అంబాసిడర్ల విధుల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో ఇంటి పన్నులు, కొళాయి పన్నులు స్వర్ణ గ్రామపంచాయతీ పోర్టల్ ద్వారనే చెల్లింపులు చేయాలని సూచించారు. గ్రామాల్లో చెత్త కుప్పలు నిల్వ లేకుండా చూడాలన్నారు.