Share News

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:33 AM

మున్సిపల్‌ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం
మాట్లాడుతున్న నాయకులు

ఎమ్మిగనూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో గురువారం మున్సిపల్‌ కార్మికుల జిల్లా జనరల్‌ బాడీ సమావేం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు కార్మికుల శ్రమను దోచిపెట్టేందేకు మోదీ ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందని ఆరోపించారు. అనంతరం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సమావేశంలో నాయకులు ప్రతాప్‌, కిరణ్‌, ఉరుకుందు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:33 AM