Share News

భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:05 AM

రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో రైల్వే అండర్‌ బ్రిడ్జి, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి తదితర రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆదోని వద్ద నిర్మించనున్న లెవెల్‌ క్రాసింగ్‌, కౌతాళం, ఆదోని మండలాల్లోని ఎరిగేరి, కుప్పగల్‌ గ్రామాల్లో నిర్మించనున్న లెవెల్‌ క్రాసింగ్‌, పెద్దకడుబూరు మండలంలోని గవిగట్టు గ్రామంలో నిర్మించనున్న లెవెల్‌ క్రాసింగ్‌, కోసిగి మండలం ఐరంగల్‌ గ్రామం వద్ద లెవెల్‌ క్రాసింగ్‌, ఆదోని మండలం కడితోట గ్రామ వద్ద లెవెల్‌ క్రాసింగ్‌, హాలహర్వి మండలం సాకిబండ గ్రామం వద్ద లెవెల్‌ క్రాసింగ్‌, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం సమీపంలో నిర్మించనున్న లెవెల్‌ క్రాసింగ్‌ల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఆదోని డివిజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్స్‌ ప్రాజెక్టులు 201, 207లను మే నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:05 AM