చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:10 PM
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని, వారి చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది పిలుపునిచ్చారు.

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని, వారి చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని న్యాయ సేవాసదన్ భవనంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసు అధికారులనుద్ధేశించి ఆయన ప్రసంగిం చారు. అంతర్జాతీయ బాలల ఒడంబడిక మేరకు వారి హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగంలో పలు అధికరణలు ఉన్నాయనీ, వాటిని అమలు చేయడానికి పోలీసు అధికారులు కృషి చేయాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ బాలల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా వారిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కోర్టు మేజిస్ర్టేట్ సరోజినమ్మ, శాశ్వత లోక అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస ఆచారి, మానసిక వైద్యు నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్‌పర్సన్ జుబేదా బేగం, డీసీపీవో శారద తదితరులు పాల్గొన్నారు.