పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:32 AM
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి సూచించారు.
కౌతాళం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి సూచించారు. మండలంలోని కరణి గ్రామంలో గురువారం వైద్యాధి కారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలి రోగాల బారిన పడినట్లు తెలియడంతో ముందస్తుగా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలను పరీక్షించినట్లు తెలిపారు. ప్రజలు శుద్ధమైన నీటిని కాచి తాగాలని సూచించారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉసేనమ్మ పారిశుధ్య పనులు చేయించారు. ఈ శిబిరంలో మండల వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.