పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:53 AM
పాఠశాలల సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు.
పాణ్యం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): పాఠశాలల సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు. మండలంలోని పిన్నాపురం ఎంపీయూపీ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. డీఈవో మాట్లాడుతూ బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజూ పాఠశా లకు హాజరవ్వాలన్నారు. హాజరు శాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు, తాగునీటి వసతి, తరగతి గదులు పరిశీలించారు. హెచ్‌ఎం సిమియోన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.